సెప్టెంబర్ 28లోగా దళతబందు యూనిట్లను గ్రౌండింగ్ పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

సెప్టెంబర్ 28లోగా దళతబందు యూనిట్లను గ్రౌండింగ్ పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0 0

     హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారుల గ్రౌoడింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 28 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

    సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో హుజూరాబాద్ నియోజక వర్గంలోని దళితబందు లబ్దిదారుల గ్రౌoడింగ్ ప్రక్రియపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, హుజరాబాద్ నియోజకవర్గం లో మిగిలియున్న 1500 దళితబందు లబ్దిదారులకు గ్రౌండింగ్ త్వరగా పూర్తిచేయాలని అన్నారు. యూనిట్ల ఎంపికలో ఆలస్యం జరగకుండా మున్సిపల్ కమీషనర్లు, క్లస్టర్ అధికారలు మరియు యంపిడిఓలు త్వరితగతిన పూర్తియ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లబ్దిదారులకు యూనిట్ల ఎంపికపై స్పష్టమైన అవగాహనను కల్పించాలని సూచించారు. ప్రతి రోజు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా గ్రౌండింగ్ ను సమీక్షినున్నట్లు కలెక్టర్ తెలిపారు.

     ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ , జెడ్పి సీఈఓ ప్రియాంక, ఎస్సి కార్పొరేషన్ స్పెషల్ అధికారి సురేష్, ఎస్సి కార్పొరేషన్ ఈడి నాగార్జున,జిల్లా నెహ్రుయువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట రాంబాబు,క్లస్టర్ అధికారులు డి ఆర్ డి ఓ శ్రీలత, డిఏఓ శ్రీధర్,డి ఎం ఓ పద్మావతి, బి. శ్రీనివాస్,నవీన్ కుమార్, మున్సిపల్ కమీషనర్లు, యంపిడిఓలు, విజయ డైయిరి అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Share This Post