సెప్టెంబర్ 29 నుండి 30 వరకు జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్.ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 22:–

సెప్టెంబర్ 29 నుండి 30 వరకు జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్.ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు గ్రామీణ అభివృద్ధి, 12 గంటలకు విద్య మరియు ఆరోగ్యం, మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్థిక మరియు ప్రణాళిక, సాయంత్రం 4:00 గంటలకు పనులు అంశాలకు సంబంధించి 1, 2 మరియు 4 ,7 స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటలకు స్త్రీ మరియు శిశు సంక్షేమం, 12 గంటలకు సాంఘిక సంక్షేమం, మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయం పై 3, 5 మరియు 6 స్థాయి సంఘం సమావేశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Share This Post