సెర్ప్ మహిళ క్లాత్ స్టోర్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా…

ప్రచురణార్థం

సెర్ప్ మహిళ క్లాత్ స్టోర్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా…

జంగిల్ గొండ
మహబూబాబాద్ జూలై 6.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్పు ద్వారా విలేజి ఎంటర్ ప్రైజెస్ స్కీం ద్వారా మంజూరు చేసిన వస్త్ర దుకాణాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ప్రారంభించారు.

మహబూబాబాద్ మండలం జంగిల్ గొండ క్రాస్ రోడ్ వద్ద మహబూబాబాద్ భారతీయ స్టేట్ బ్యాంక్ లక్ష రూపాయలు రుణం మంజూరు చేయగ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిఆర్డిఎ సెర్ప్ ద్వారా లెక్కల ఉమ వస్త్ర దుకాణం ఏర్పాటు చేసుకున్నారు.

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ మహిళలు దిన దినాభివృద్ధి చెందుతూ ఆర్థిక అభివృద్ధి సాధించి సాధికారత దిశగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం, స్థానిక శాసన సభ్యులు బానోతు శంకర్ నాయక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జడ్పీ సీఈవో అప్పారావు డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, తదితరులు పాల్గొన్నారు.
______________________________
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post