సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు…. జిల్లా ఖజానా అధికారి.
జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ లను సమర్పించవచ్చని జిల్లా ఖజానా కార్యాలయ ఉపసంచాలకులు
ఎం. కవిత మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఉప కోశాధికారి మరియు జిల్లా ఖజానా కార్యాలయాల ద్వారా పెన్షన్లను పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ప్రతి సంవత్సరం ఖజానా కార్యాలయాలలో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్లను ఇక నుండి ఇంటి వద్ద నుండే తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా సెల్ఫీ తీసుకొని సమర్పించవచ్చని ఆమె తెలిపారు.
అందుకోసం టి -యాప్ ఫోలియో (T- App Folio) అనే మొబైల్ యాప్ ను ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్) లేదా యాప్ స్టోర్ (యాపిల్) ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ ను నవంబర్ ఒకటి నుండి 31 మార్చి, 2022 లోపు సమర్పించాలని ఆమె సూచించారు.
ఇట్టి విషయంలో ఏవేని సందేహాలు ఉన్నట్లయితే జిల్లా ఖజానా కార్యాలయంలో/ఉప కోశాధికారి కార్యాలయాల్లో సంప్రదించవచ్చని ఆమె సూచించారు.