సేంద్రియ దేశీయ పద్ధతిలో సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

సేంద్రియ దేశీయ పద్ధతిలో సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

సేంద్రియ దేశీయ పద్ధతిలో సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తాళ్ళపూసపల్లి (కేసముద్రం మండలం),
మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ -30:

రైతులు సేంద్రియ దేశీయ పద్ధతుల్లో సాగు కై ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శనివారం ఉదయం కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆత్మ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ నేతృత్వంలో సేంద్రియ పద్ధతుల్లో దేశీయ వరి సాగు పై క్షేత్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ, సేంద్రీయ దేశీయ పద్ధతిలో ప్రతి రైతు వ్యవసాయ సాగు లు చేయాలని, భూసారం కర్బన శాతం పెంచుకోవాలని , ఒక ఎకరం విస్తీర్ణంలో దేశీయ వరి పంటను సాగు చేస్తున్న జైపాల్ రెడ్డి క్షేత్రాన్ని సందర్శించి ఈ యాసంగి కాలంలొ కుజి పటాలియా అను వరి రకాన్ని సాగు చేస్తున్న తీరును సందర్శించి పరిశీలించారు.

రసాయన ఎరువులు పురుగు మందులు అపరిమితంగా అంతకుమించి వాడటం వలన పంట నష్టం జరుగుతుందని, భూ సారాలు తగ్గుతున్నాయని, భూమి భౌతిక స్థితి దెబ్బతిని పంట దిగుబడులు తగ్గుతున్నాయిని, రసాయన ఎరువులు మొక్కలకు తద్వారా మనుషులకు శరీరంలో ప్రవేశించి అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. దేశీయ రకం వరి తో పోషకాలు మెండుగా ఉంటాయని తెలిపారు.

సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తూ, రసాయన ఎరువులను పంటలకు తగ్గించాలని ,సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం వల్ల ఎంతో లాభదాయకమని, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో తప్పనిసరిగా ఈ పద్ధతులను అవలంబించి లాభసాటి వ్యవసాయం పొందవచ్చని తెలిపారు. రసాయన ఎరువులను అతిగా వినియోగించడం వల్ల భూసారం తగ్గడంతో పాటు రసాయన అవశేషాలు పంటలకు పట్టి ధాన్యం నుండి మనకు వేర్వేరు రకాలుగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయియని, పోషకాలు లేని ఆహారాన్ని మనం తీసుకుంటున్నామని, దానివల్ల రోగాల బారిన పడి మన ఆరోగ్యాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తున్నామని తద్వారా రోగాల బారిన పడుతున్నా మన్నారు. కుజీ పట్టాలియా వరి రకం తో రైతులకు దిగుబడి తో పాటు ఎంతో మేలు జరుగుతుందని, జిల్లాలోని రైతులు అందరూ ఈ పద్ధతులను అనుసరించి సాగు చేసే విధానం సంబంధిత వ్యవసాయ అధికారుల నుండి తెలుసుకొని జీవామృతం తయారు చేసుకొని అధిక దిగుబడి లు పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, కె.వి.కె మల్యాల కోఆర్డినేటర్ మాలతి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, రైతు బ o దు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ఢీ ప్రవీణ్ కుమార్, గ్రామ కో ఆర్డినేటర్ వెంకన్న, ఎ డి ఎ లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్త డాక్టర్ రత్నాకర్ రెడ్డి, ఏ ఓ వెంకన్న, తాసిల్దార్ ఫరీద్, ఎంపీడీవో రోజా రాణి, జిల్లా రైతు బంధు సమితి నెంబర్ యాకూబ్ రెడ్డి, ఎంపీవో , ఎఫ్ పి ఓ, ఎపిఓ, ఏ ఈ ఓ లు, ఆత్మ సభ్యులు, వివిధ గ్రామాల సేంద్రియ సాగు రైతులు, అభ్యుదయ రైతులు హెచ్ వో వరుణ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post