సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి వ్యవసాయ అధికారులకు సూచించారు.

మంగళవారం నాడు భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో  సేంద్రియ వ్యవసాయం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తి పంటలు పండించే రైతులతో  ఆయన సమావేశమయ్యారు.  రైతులు తమ ఉత్పత్తులను సేంద్రీయ వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ద్వారా మార్కెట్ యార్డులలో అమ్ముకునేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇతర ప్రాంతాలకు కూడా  ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు.  సేంద్రియ పంటల ఉత్పత్తులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.  సేంద్రియ ఉత్పత్తుల రైతులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చి ఇతరులకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామంలో సేంద్రియ ఉత్పత్తుల రైతులను గుర్తించి ఇతర రైతులకు ఆదర్శంగా పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి అన్నపూర్ణ,  రైతులు పాల్గొన్నారు.

Share This Post