సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్


సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0

     పంటలను హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల ద్వారా కాకుండా సేంద్రియ విదానంతో రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

     రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామాన్ని డాక్టర్ గోగుల గౌతమిరెడ్డి దత్తత తీసుకుని అభివృద్ది చేసిన కార్యక్రమాలపై నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్బంగా అందరికి శుభాకాంక్షలను తెలియజేశారు. ఏ విధంగా పోరాడి దేశ స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామో, అదే విధంగా సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుందని,ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేసేలా అందరు ముందుకు రావాలని అన్నారు. రసాయనాలను వాడి పండించే పంటల ద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ ల బారిన పడుతున్నామని, ప్రస్తుతం మనం అన్నం కూడా సంతృప్తిగా తినడం మానేసి మన తాతలు, తండ్రులు తిన్న గోదుమ, రాగులు వంటి వాటిపైపు దృష్టిని సారిస్తున్నామని అన్నారు. కాబట్టి హరిత విప్లవం ద్వారా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని పేర్కోన్నారు. రైతులకు జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారుల ద్వారా మరింత అవగాహన కల్పిస్తామని పేర్కోన్నారు. తెలంగాణలో కాళేశ్వరం, మిడ్ మానేర్ ప్రాజెక్టుల వలన సమృద్దిగా నీరు వనరులు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా ప్రతి ఇంటికి పెన్షన్, రైతుభీమా, రైతు బందు వంటి పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.  టి ఎస్ పి ఎస్ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారిచేసిందని, నిరుద్యోగులు బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఇట్టి సదవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ సమస్యలపై ప్రతి మూడు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహించుకోవడం ద్వారా మరింత అభివృద్ది సాధించగలుగుతారని అన్నారు.

     డా. గౌతమిరెడ్డి మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం ద్వారా అరోగ్య పరిస్థితులలో మంచి మార్పులను చవిచూస్తామని మనం పండించే పంటలో కనీసం 25శాతం సేంద్రీయ పద్దతిలో సాగు విధానాన్ని అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ప్రతిఒక్కరు సేంద్రియ వ్యవసాయ విధానంపై అవగాహనను కలిగి ఉండాలని. వర్మి కంపోస్టు విదానాన్ని గ్రామంలో యువత ప్రారంభించాలని అన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలోని సమస్యలను ప్రణాళిక ప్రకారం తీర్చడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా వ్యాపారం చేసుకోవాలనె వారు ముద్రయోజన పథకంపై అవగాహన కలిగి ఉండాలని ఈ పథకం ద్వారా 50వేల నుండి 5లక్షల రూపాయల వరకు ఋణ సదుపాయం అందిస్తారని అన్నారు. గ్రామ సమస్యలు, అభివృద్దిని గురించి తన దృష్టికి తీసుకువచ్చినట్లయితె ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్దామని అన్నారు.

     ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, తహసీల్దార్, వ్యవసాయ అధికారులు పాల్గోన్నారు.

Share This Post