సేవ కార్యక్రమ లలో రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది జిల్లా కలెక్టర్ డి హరిచందన

సేవ కార్యక్రమ లలో  రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా కేంద్రం లోని జిల్లా ఆసుపత్రి లో రెడ్ క్రాస్ సొసైటీ అద్వర్యం లో రోగులకు హైజినిక్ కిట్స్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి .హరిచందన ఐఏఎస్ మాట్లాడుతూ సేవ కార్యక్రమాలలో రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుందని పేర్కొన్నారు. శనివారం రెడ్ క్రాస్ సొసైటీ మరియు లైన్స్ క్లబ్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్పన్ల హోమ్ ( అనాధ ఆశ్రమం ) లో దుప్పట్లు పంపిణీ చేశారు.  పిల్ల లతో కలిసి ఆశ్రమం లో మొక్కలు నాటారు. ఆశ్రమం లో దుప్పట్ల పంపిణీ కంటే ముందు జిల్లా ఆసుపత్రి లో ప్రసూతి రోగులకు దుప్పట్లను మరియు ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందికి హైజినిక్ కిట్స్ పంపిణీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణం అవరణం లో పరిశుభ్రతలను పాటించాలని, లోపల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాద్యత శాటిటేషన్ సభ్యులదే అన్ని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, రెడ్ క్రాస్ ఛైర్మన్ కే.సుదర్శన్ రెడ్డి, ఆసుపత్రి సుపెరడెంట్ డాక్టర్ రంజిత్ , మున్సిపల్ కమిషనర్ సునీత, లయన్ శ్రీనివాస్ లాహోటి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు జనార్దన్, లయన్ భీంచందర్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటి సభ్యులు జగదీష్ ఖన్నా ,ఏ. చెన్నరెడ్డి, ఆత్మరాం ఎడ్కే,సాయినాథ్, రవిగౌడ్, బాలాజి,సత్యనారాయణ,ఆనంద్ చారి పాల్గొన్నారు.

Share This Post