సైనిక కుటుంబాలకు విరివిగా విరాళాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సాయుధ దళాల పతాక దినోత్సవం

సైనిక కుటుంబాలకు విరివిగా విరాళాలు ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

సాయుధ దళాల పతాక దినోత్సవం

00000

దేశ రక్షణలో ఉంటున్న సైనికులు, వారి కుటుంబాల కోసం పౌరులందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎస్ ఆర్ అర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ సి సి విద్యార్థులు కలెక్టర్ ను క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి విరాళం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సైనిక కుటుంబాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరారు. ఈ విరాళాలను డిడి రూపంలో సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయానికి పంపుతారని ఆన్నారు.

Share This Post