GHMC మరియు కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సోమవారం ఖైరతాబాద్ లోని ఒల్డ్ CIB క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు నగరంలోని 4846 కాలనీలు, స్లమ్స్ ఏరియాలో వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలి ఉన్న పౌరులకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక mop up drive చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా ప్రత్యేక టీమ్ లు ప్రతి ఇంటిని సందర్శించి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తిస్తారని తెలిపారు. ఈ టీమ్ లు వ్యాక్సినేషన్ వేయించుకునేలా ప్రజలను motivate చేస్తారని, వారికి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, తేదిని, సమయంతో పాటు వారి వివరాలు ముందుగా తెలుపుతారని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇంటి సభ్యులందరి వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఇంటి తలుపుల మీద ప్రత్యేక స్టిక్కర్ అతికిస్తారన్నారు. హైదరాబాద్ నగరాన్ని 100% వ్యాక్సినేటేడ్ నగరంగా లక్ష్యాన్ని సాధించాలని ప్రత్యేక మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న కాలనీలలో కాలనీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఇతర కాలనీలలో కూడా 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు జిహెచ్ఎంసి మరియు వైద్య అధికారులను ప్రధాన కార్యదర్శి అభినందిస్తూ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలను ప్రధాన కార్యదర్శి కోరారు.ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీ శర్మన్ ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ సోమవారం ఖైరతాబాద్ లోని ఒల్డ్ CIB క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్.
You might also like:
-
Chief Secretary Santhi Kumari asked the officials to come prepared with all details for the upcoming visit of the Election Commission of India (ECI) officials to the state.
-
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
-
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జిఓ 58, 59 అమలు, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సాంఘిక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
-
అమెరికా అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ ఒప్పందం