సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ రేగళ్ల క్రాస్ రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద మీడియన్, అవెన్యూ ప్లాంటేషన్, లోతువాగులో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె పకృతి వనాలను ఆకస్మిక తనిఖీ చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి మీడియన్ ప్లాంటేషన్లో మల్టీపర్పస్ మొక్కలు నాటాలని చెప్పారు. రహదారికి ఇరువైపులా చాలా ఖాళీ స్థలం ఉన్నదని మొక్కలు నాటాలని చెప్పారు. ఈ రహదారి మన జిల్లాకు ఐకాన్ రహదారి అని పచ్చదనంతో నిండి ఉండాలని, మొక్కలతో రహదారి ముస్తాబు కావాలని చెప్పారు. డివైడర్లులో మొక్కలకు పాదులు చేసి ఎరువు వేసి మంచిగా పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రామచంద్ర కళాశాల పరిసరాల్లో మొక్కలు మంచిగా ఉన్నాయని, అదే విధంగా ఈ ప్రాంతంలో కూడా మొక్కలు నాటాలని అభినందించారు. అవసరమైన నిధులు కొరకు తనకు ప్రతిపాదనలు పంపాలని యంపిడిఓకు సూచించారు. డివైడర్లు ప్రక్కనున్న వ్యర్థాలతో పాటు రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని చెప్పారు. ఎండలు ముదరక ముందే మొక్కలు నాటాలని, ఈ సీజన్లో మొక్కలు బాగా పెరుగుతాయని, ప్రతి ఇంచు ఖాళీ స్థలంలో మొక్కలు కనబడాలని చెప్పారు. ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని మీడియన్ ప్లాంటేషన్లో గ్యాప్ లేకుండా మొక్కలు నాటాలని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ పోల్స్ ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ చేయాలని చెప్పారు. అనంతరం లోతువాగు బృహత్ పకృతి వనాన్ని తనిఖీ చేశారు. పకృతి వనం ఉన్నట్లు ప్రయాణికులు, ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా ప్రధాన రహదారిలో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెద్ద చెట్లు క్రింద ప్రజలు కూర్చోడానికి వీలుగా చెట్టూ చుట్టూరా దిమ్మెలు కట్టించాలని, అలాగే కొన్ని కొన్ని చోట్ల బెంచీలు దాతల సహాకారంతో ఏర్పాటు చేయాలని చెప్పారు. అంచనా విలువతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ప్రతి మొక్కకు సమృద్దిగా నీరు పెట్టేందుకు డ్రిప్ ఏర్పాటు చేయుటకు కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న స్థలంలో పార్కు చేయడం పట్ల మంచి స్థలాన్ని కేటాయించారని అభినందించారు. పార్కులో వాకింగ్పాత్ ఏర్పాటు చేయాలని, పాలికి ఇరువైపులా ఇటుకలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కును డ్రోన్ కెమెరాతో వీడియో తీయించి బద్రపరచాలని చెప్పారు. పార్కును నాచురల్ తయారు చేయాలని, ప్రజల ఆహ్లాదనాకి ఉపయోగపడటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలతో పాటు ఈ రహదారిలో ప్రయాణం చేసే ప్రయాణికులు సైతం పార్కులను సందర్శించాలని, అపుడే ఈ పార్కు యొక్క లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యంపిడిఓ రామారావు, యంపిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Post