ప్రచురణార్ధం
అక్టోబరు, 25, ఖమ్మం:
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం “గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ శిక్షణ కలెక్టర్ బి. రాహుల్ తో కలిసి స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు సమర్పించిన అర్జీలను ఆయా శాఖలకు చెందిన అర్జీలపై సంబంధిత అధికారులు సత్వర చర్యలు గైకొని పరిష్కార స్వభావాన్ని అర్జీదారులకు స్పష్టంగా తెలియపర్చాలని, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్ జిల్లా అధికారులకు సూచించారు.
కొణిజెర్ల మండలం లింగగూడెం గ్రామంకు చెందిన కాంపెల్లి తిరుపతమ్మ తాను వికలాంగులరాలినని, డిగ్రీ చదువుకున్నానని తన తల్లిదండ్రులు కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తనకు ఏదైనా ఉద్యోగం కల్పించగలరని, వేంసూరు మండలం కందుకూరు గ్రామంకు చెందిన పర్పాని మనూష తాను యాక్సిండెంట్లో కుడిచేయి కోల్పోయానని, అంగవైకల్యం కలిగియున్నానని 10వ తరగతి చదువుకున్నానని, తన భర్తమరణించినాడని తన ఇద్దరు పిల్లల పోషణ, జీవనోపాధికి ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యకై జిల్లా ఉపాధి కల్పనాధికారికి సూచించారు. ఖమ్మం అర్బన్ మండలంకు చెందిన డి. సైదా తాను ఆశా వర్కర్ గా పనిచేసానని, అనివార్య కారణాల వల్ల విధులు నిర్వహించలేకపోయానని. మరల తనకు ఆశా వర్కర్గా పనిచేయుటకు అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. కూసుమంచికి చెందిన యం. విజయలక్ష్మీ 493/2లో ఎ2 సర్వేనెంబరులో గల-23 కుంటలు, 542 ఎ సర్వేనెంబరులో 1.00 కుంట తన కుమారులకు వారసత్వంగా వచ్చినదని దానికి పాస్ పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తహశీల్దారుకు తగు చర్యకై ఆదేశించారు. చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంకు చెందిన బండి కొండల్ తాను వికలాంగుడనని తనకు త్రిచక్ర వాహనం మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా స్త్రీ శిశు, వికలాంగులుల సంక్షేమ శాఖాధికారికి సూచించారు. మజ్జీద్ ఈ-అయోషా సిద్ధికా 59వ డివిజన్ దానవాయిగూడెం వారు తమమజ్జీద్ వెనుక కాలనీలో పందులు విపరీతంగా తిరుగుతున్నాయని వాటి వల్లన వ్యాధులు ప్రభలుతున్నాయని. కనుక వాటిని నివారించిందేకు తగు చర్యలు తీసుకోగలరని సమర్పించిన దరఖాస్తును జిల్లా పంచాయితీ అధికారికి సూచించారు. ఖమ్మం నగరంకు చెందిన కుదురుపాక రాధిక తాము నిరుపేదలమని తమకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్మకై ఖమ్మం అర్బన్ తహశీల్దారుకు. సూచించారు.
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు గ్రీవెన్స్ లో పాల్గొన్నారు.