సోమవారం నాడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, మండలంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

సోమవారం నాడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, మండలంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ / ఎల్కతుర్తి*

*జూన్ 06*

*ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు*

*పల్లే ప్రగతిలో శానిటేషన్, పచ్చదనానికి ప్రాధాన్యత*

*కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

సోమవారం నాడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, మండలంలో పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వార్డుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పల్లే ప్రగతిలో భాగంగా మండలంలోని కోతులనడుమ, శాంతి నగర్, లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారుఆయా గ్రామాల్లోని పల్లే ప్రగతి వానలు, నర్సరీలు, క్రీడా మైదానాలను పరిశీలించారు.

పల్లే ప్రకృతి వానల్లోకి జనాలు వస్తున్నారా అని ఆరా తీశారు. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాల ఎంపిక గురించి తహశీల్దార్ ను వాకబు చేశారు.

శాంతి నగర్ లో పొలంలోని కొయ్యలను కల్చడాన్ని చూసి కలెక్టరు ఇలా కల్చవద్దని, వవ్యసాయ అధికారులు రైతులకు తగు సూచనలు చేయాలని తెలిపారు. పల్లే ప్రకృతి వానల్లో నీ చెట్లను ఎండిపోకుండా నీళ్ళు పోయాలని చెప్పారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 5వ విడత పల్లే, పట్టణ ప్రగతి గతంలో చేసిన పనులను పరిశీలంచడం తో పాటు శానిటేషన్,పచ్చధనం పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తూన్నట్లు చెప్పారు.

ముఖ్యంగా క్రీడా మైదానాల ఏర్పాటు వల్ల శారీరకంగా ఫిట్ గా ఉండడమే కాకుండా మానసిక ఒత్తిడిని జయించే విధంగా ఉందుటుందని అన్నారు.

అందుకు ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పిఈటిల సహాయంతో క్రీడా మైదానాల్లో వివిధ ఆటలకు కావాల్సిన మార్కింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

నర్సరీల్లో పెరిగే వివిధ రకాల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నాయని, అవెన్యా ప్లాంటేషన్స్ లో, ఆ మొక్కలను ఎక్కువగా నాటనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి. మేకల, స్వప్న, తాహిసిల్దర్,జి. రవీందర్, ఎంపిడిఓ సునీత, సర్పంచ్ లు, బోయినపల్లి రజిత, బాసని. వెలాంగిణీ మేరీ, ఎంపిఓ విజయ లక్ష్మి, విమల, కొమురయ్య, రవిందర్, లావణ్య తదితరులు ఉన్నారు.

Share This Post