ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం నాడు వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ కోరారు.