సోషల్ సెక్యురిటి స్కీం (SSS) (ప్రభుత్వ బీమా పధకాలను) ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ కే చ0ద్రా రెడ్డి

సోషల్  సెక్యురిటి స్కీం (SSS) (ప్రభుత్వ బీమా పధకాలను) ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ కే చ0ద్రా రెడ్డి.

మంగళవారం ఉదయం చాంబర్ లో జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశం లో అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నిర్వహిస్తున్న సోషల్  సెక్యురిటి స్కీం మెగా కంపైన్  లో పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఏర్పాటు అయిన తరువాత మొట్టమొదటి సారిగా షోషల్  సెక్యురిటి స్కీం క్యాంప్ ను నిర్వహించటం ఆనందదాయకంగా ఉందన్నారు.ఈ స్కీం లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమ యోజన, ప్రధాన మంత్రి సుర క్ష యోజన, అటల్ పెన్షన్ యోజన వివిధ స్కీం ల ద్వార సవత్సరానికి 330/-,12/- మరియు సుకన్య సమృద్ది  యోజన (12సవత్సరాలు లోపు ఉన్న  బాలికలకు ఈ యొక్క స్కీం వర్తిస్తుందని) ఈ యొక్క స్కీం లో ప్రతి ఒక్కరు చేరేటట్లు చెయ్యాలని సూచించారు. జిల్లా కార్యాలయాలలో లో పనిచేసే ప్రతి ఒక్కరు, మరియు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ స్కీం ను సద్వినియోగం చేసుకుని లబ్ది పొందవచ్చన్నారు. 10-11-2021 నాడు జిల్లా కేంద్రం అయిన నారాయణపేట అర్దిఒ కార్యాలయం లో ఉదయం 09:00నుంచి మద్యాహ్నం 03:00 గంటల వరకు ఈ మేళ నిర్వహించబడుతుందని ఈ మేళ లో జిల్లా ప్రజలు పాల్గొని అట్టి స్కీంల లో చేరాలని సూచించారు. ఈ సమావేశం లో జిల్లా అధికారులు అందరూ చేరడం జరిగిందని లిడ్ బ్యాంక్ మేనేజెర్ ప్రసన్న కుమార్ తెలిపారు.

ఈ సమావేశం లో  జిల్లా అధికారులు కృష్ణమ చారి, రామ్ మనోహర్ రావు, మురళి, వేణుగోపాల్, సిద్రమప్ప, మున్సిపల్ కమిషనర్ లు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post