సౌకర్యాలు బావున్నాయి కాబట్టే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్య మాధవికి ప్రసవం చేపించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళ వారం రాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించామని 1.19 నిమిషాలకు వైద్యలు సస్త్ర చికిత్స నిర్వహించారని చెప్పారు.  ప్రభుత్వం  ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్య సేవలు అందించు విదంగా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం వైద్య సేవలు నిర్వహణకు ఆసుపత్రుల్లో అధునాతన వైద్య పరికరాలతో పాటు సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.  అన్ని సౌకర్యాలు బావున్నాయి, మంచి వైద్య సిబ్బంది ఉన్నారు, చికిత్సకు వచ్చే వారికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. తల్లి, బిడ్డ  క్షేమంగా ఉన్నారని, వైద్య సిబ్బంది సేవలు చాలా బావున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అంటే చాలా మంది భయపడుతున్నారు. చేతిలో డబ్బులు లేకున్నా… తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండేందుకు  ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతుంటారు. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ప్రసవాలు కొరకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడం వల్ల పేదింటి ప్రజలు నియంత్రణ లేని ఇబ్బడి ముబ్బడి ఫీజులను చెల్లింపు చేస్తున్నారని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్ తో పాటు బాలిక, బాలురకు ప్రోత్సాహకంగా నగదు ఇచ్చే పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.  ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. రుగ్మతలతో, అనారోగ్యాలతో,  కాన్పు కోసం వచ్చిన గర్భిణీలకు ప్రభుత్వ దవాఖానాలో నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలు అందించాలి, ఆ విధంగా వైద్యారోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కృషి ఉండాలని జిల్లా అధికారిగా సమీక్షలు చేయడం వేరు స్వయానా ఆ అధికారే ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడం వేరు. చెప్పడం కాకుండా చేసి చూపించడమే “ఆచరణ”. ఆచరిస్తూ సహజంగా జీవనం సాగించడమే “ఆదర్శం.”భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  అనుదీప్ తన భార్య మాధవికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా లో ప్రసవ సేవలు పొందడం అభినందనీయం.గత ప్రభుత్వాల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవకానకు అన్న పరిస్థితి ఉండేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం సేవలు మెరుగైన మాట వాస్తవమే. కానీ వైద్యులు, సౌకర్యాల వల్ల ఒక జిల్లా కలెక్టర్ సామాన్య పౌరుడిగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు పొందడం ఆదర్షమనే చెప్పాలి.  డా భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్య లక్ష్మీ, పర్యవేక్షకులు రామకృష్ణ, ఆసుపత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post