స్టెమ్ (STEM) సాంకేతిక సంస్థ రూపొందించిన స్థంబ్రాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) ముసాయిదా మాస్టర్ ప్లాను స్టెమ్ సాంకేతిక సంస్థ ప్రతినిధి శ్రీకుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, కు వివరించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 09, ఖమ్మం:–

స్టెమ్ (STEM) సాంకేతిక సంస్థ రూపొందించిన స్థంబ్రాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) ముసాయిదా మాస్టర్ ప్లాన్ను  మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్టెమ్ సాంకేతిక సంస్థ ప్రతినిధి శ్రీకుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురబీకు వివరించారు. రాబోయో 20 సంవత్సరాలలో సుడా పరిధిలో పెరుగనున్న జనాభా కనుగుణంగా విద్య, వైద్య రంగాలలో అవసరమయిన మార్పులు చేర్పులు చేయుటకు స్టాక్ హోల్డర్స్ సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జి.పి.ఎస్. ఆధునిక విధానంతో రూపొందించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ను కలెక్టరు వివరించారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమి పబ్లిక్, జోన్ల వివరాలు, రోడ్ల విస్తరణ, చెరువులు, కాలువలు, వాగుల వివరాలు తదితర అంశాల గురించి జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించి పలు సూచనలు చేశారు.

శిక్షణ కలెక్టర్ రాహుల్, ల్యాండ్ సర్వే ఏ.డి. వి. రాము, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు, స్టెమ్ సాంకేతిక సంస్థ ప్రతినిధులు శ్రవణ్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post