స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన – ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య

స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన – ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య

మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలికి ఈ నెల 10 న జరగనున్న పోలింగ్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సోమవారం నాడు జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్ తో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న కిటికీలను ప్లయి వుడ్ తో పూర్తిగా మూసివేయాలని, కళాశాలో ఉన్న 4 సి.సి.కెమెరాలను పరిశీలించి అదనంగా మరో రెండు కెమెరాలను బ్యాక్ సైడ్, మరియు ప్రక్కన ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు. అదేవిధంగా కళాశాలలోకి వచ్చి, పోవడానికి ఒకే ప్రధాన ద్వారాన్ని ఉపయోగించేలా చూడాలని సూచించారు. అవసరమైన మేరకు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్ధార్ భానుప్రసాద్, కళాశాల ప్రధానాచార్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post