You Are Here:Home→స్త్రీనిధి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
స్త్రీనిధి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
స్త్రీనిధి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ సమావేశ మందిరంలో సెర్పుకు సంబంధించిన డి.పి.ఎం.లు, ఎ.పి.ఎం.లు, సి.సి.లు, స్త్రీనిధి సిబ్బందితో స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, పి.ఎం.ఎఫ్.ఎం.ఇ., ఫార్మ్,నాన్ ఫార్మ్, ఐ.బి. ఇనిస్ట్యూషన్ బిల్డింగ్, డి.పి.ఆర్., తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్త్రీనిధి ఋణాల నగదు రికవరీ చేసేందుకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టినందున క్షేత్రస్థాయి సిబ్బంది తగు చర్యలు తీసుకుని వేగంగా రికవరీ చేయాలని ఆయన తెలిపారు. స్త్రీనిధి గ్రూప్ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, స్త్రీనిధి గ్రూపు సభ్యులలో ఇప్పటి వరకు తీసుకున్న రుణం ఎంత, ఎంతమొత్తం రుణం కట్టారు? ఇంకా ఎంత రుణం కట్టాలన్న విషయాలు తెలుసుకుని పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు డి.ఆర్.డి.ఓ.కు పంపించాలని ఆయన కోరారు. రుణాల వసూలు చేస్తుండటంతో ఇతర గ్రూపుల్లోని సభ్యులు కూడా అప్రమత్తమై వారు కూడా రికవరీకి సహకరిస్తారని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో సి.సి.లు, ఎ.పి.ఎం.లు, ప్రముఖ పాత్ర వహించాలని, అదే విధంగా సి.సి. నుండి డి.ఆర్.డి.ఓ. వరకు అందరు కలిసికట్టుగా సమన్వయంతో పని చేసి రికవరీ ఎక్కువ మొత్తంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అడవి దేవుల పల్లికి ప్రత్యక్షంగా వెళ్లి అక్కడి పరిస్థితులపై చర్చించి తనకు పూర్తి సమాచారం అందజేయాలని కలెక్టర్ డి.ఆర్.డి.ఓ.ను ఆదేశించారు.సిబ్బందితో సమీక్షించి ఎప్పటి కప్పుడు పని తీరు మెరుగు పరచాలని అన్నారు. పని చేయాలనే సంకల్పం ఉన్న వారికి అనేక మార్గాలు ఉంటాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిపై పట్టు సాధించి సంస్థను పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ డి.ఆర్.డి.ఓ.ను కోరారు. గ్రూప్ ల నుండి గ్రామ, గ్రామాల నుండి మండల స్థాయి నివేదికలను డి.ఆర్.డి.ఓ. దృష్టికి తీసుకువచ్చి రికవరీలో ఇప్పటికే ప్రగతి సాధించాల్సి ఉండే కాని చివరి వరకు ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం జిల్లా కలెక్టర్ గమనించారు. ముఖ్యంగా ఒక యూనిట్ వైజ్ గా ఎంత ఎన్.పి.ఎ. ఉన్నది. అదే విధంగా బ్యాంకుల వారీగా ఎంత ఎన్.పి.ఎ. ఉన్నదో ఆయా వివరాలను ధృవీకరించుకుని డి.ఆర్.డి.ఓ.కు వెంటనే పంపించాలని ఆయన తెలిపారు. ఎన్.పి.ఎ.కి సంబంధించిన పర్సెంటేజ్ వివరాలు ఎప్పటికప్పుడు తనకు వాట్సాప్ పంపించాలని డి.ఆర్.డి.ఓ.ను కలెక్టర్ ఆదేశించారు. డి.పి.ఎం.లు, ఎ.పి.ఎం.లు క్షేత్రస్థాయిలో పర్యటించి కిందిస్థాయి సిబ్బంది పని తీరును మెరుగు పర్చాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను డి.ఆర్.డి.ఓ. దృష్టికి తేవాలని, వారు వెంటనే ఒక టీమ్ ను పంపించి తగు చర్యలు తీసుకునేలా కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 23వ తేదీన రికవరీలో వెనుకబడిన మండలాలు, గ్రామాలకు చెందిన ముఖ్యమైన సిబ్బందిని జిల్లా కేంద్రానికి పిలిపించాలని డి.ఆర్.డి.ఓ.ను ఆదేశించారు. ఏప్రిల్, 1వ తేదీన మళ్ళీ సమీక్ష ఉంటుందని, ఈలో గా పనితీరు మెరుగుపడాలి లేకుండా కఠిన చర్యలు త ప్పవని ఆయన అన్నారు. ఇదే స్పూర్తితో మన జిల్లాను రాబోయే కాలంలో పురోభివృద్ది సాధించడానికి అందరు సమిష్టి బాధ్యతతో పని చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. కాళిందిని,స్త్రీనిధి జోనల్ మేనేజర్ అనంత కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
స్త్రీనిధి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.