స్త్రీ నిధి ఋణాల లక్ష్యం సాధించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 5: జిల్లాలో స్త్రీ నిధి ఋణాల అందజేత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ ఋణాల అందజేతపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 11 వేల 590 మహిళా స్వయం సహాయక సంఘాలున్నట్లు తెలిపారు. స్త్రీ నిధి ద్వారా 71 కోట్ల ఋణాలు ఇవ్వనుండగా, ఇప్పటికి 10 కోట్ల 14 లక్షలు మాత్రమే అందించారన్నారు. మిగతా లక్ష్యాన్ని ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టి, అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జీవనోపాధి క్రింద మహిళా సంఘాలకు పాడి పశువులను అందించాలన్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాన్ పేమెంట్ సంఘాలను చైతన్యంలోకి తేవాలన్నారు. జిల్లాలో బ్యాంక్ లింకేజీ లక్ష్యం 285 కోట్లు కాగా, ఇప్పటికి 3 వేల 900 సంఘాలకు 145 కోట్ల ఋణాలు అందజేశామన్నారు. ఏపీఎం, సిసి లు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో జి. రాంరెడ్డి, అదనపు డిఆర్డీవో నూరోద్దీన్, స్త్రీ నిధి ఆర్.ఎం. వి. పూర్ణచందర్, డిజిఎం వెంకట్ రెడ్డి, సంధ్య కుమారి, ఏపీఎం లు, సిసి లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post