స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

బాలల దినోత్సవాన్ని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక DPRC భవనములో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ హాజరై మాట్లాడుతూ నవంబర్, 14వ తేదీని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారని ఇది మన భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేదరికం కారణంగా కొంతమంది చిన్నారులు అతి చిన్న వయసులో పలక/ బలపం పట్టాల్సిన చేతులతో తట్ట పార పట్టి కూలీ పనులకు వెళ్లడం ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం, దీనికి కారణం నిరక్షరాస్యత మరియు ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేసారు. అంతేకాక నేటికి కూడా బాలికలు లైంగిక దాడులకు గురి కావడం జరుగుతుందని, ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని, అంతేకాక ప్రభుత్వం తరఫున బాల్య వివాహాల పైన లైన్ డిపార్ట్మెంట్ తో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంకా కూడా ఎక్కడో ఒకచోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కరోనా కాలంలో చాలా మంది పిల్లలు అనాధలుగా మారి పోవడం జరిగింది అటువంటి పిల్లలకు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ తరపున ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈరోజు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని, అంతేకాక ఈ శాఖ తరఫున కోవిడ్ కాలంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు అటువంటి కుటుంబాలను గుర్తించి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చాలా గర్వకారణమని ఈ సందర్బంగా తెలియజేసారు. అదేవిధంగా పిల్లల విషయంలో చైల్డ్ లైన్ మరియు ప్రజా ప్రతినిధుల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి లలిత కుమారి మాట్లాడుతూ అనాధ పిల్లలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న హోమ్స్ అదేవిధంగా ప్రభుత్వం చేత నిర్వహిస్తున్న హోమ్స్ లో పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతిని కల్పించడం జరిగిందని, కోవిడ్ -19 కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మా శాఖ తరపున స్పాన్సర్ షిప్ కార్యక్రమం క్రింద నెలకు రెండు వేలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పిల్లల విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా మా శాఖ తరపున ఎల్లప్పుడూ సహకారం అందించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్బంగా బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శ్రీమతి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ తరఫున పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతిని ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహిస్తున్న హోమ్స్ లలో అందివ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు మా శాఖ తరపున స్పాన్సర్ షిప్ క్రింద నెలకు 2000 ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీఓ కోటాజి, డి వై ఎస్ ఒ హనుమంతరావు, వైద్య శాఖ పోగ్రామ్ ఆఫీసర్ లలిత కుమారి, కేర్ ఇండియా స్టేట్ కోఆర్డినేటర్ అరుణ , ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post