స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, ఆకుకూరలలో ఎన్నో పౌష్టికాలు ఉంటాయని, వాటి ద్వారా చిన్న పిల్లలో పౌష్టికాహార లోపం నివారించవచ్చనే విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలని స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు

స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, ఆకుకూరలలో ఎన్నో పౌష్టికాలు ఉంటాయని, వాటి ద్వారా  చిన్న పిల్లలో పౌష్టికాహార లోపం నివారించవచ్చనే విషయాన్ని  ప్రజలకు  అర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలని స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి  అన్నారు.  పోషణ్ మాసం సందర్బంగా మాహిళాభివృద్ధి  మరియు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లొ నిర్వహించిన మెగా ఫుడ్ మేళా కు జిల్లా కలెక్టర్ హరిచందనతో  పాటు మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, జిల్లా అధికారులు   పాల్గొన్నారు.  ఈ ఫుడ్ మేళాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా స్థానికంగా దొరికే కొర్రలు, రాగులు,  సజ్జలు, జొన్నలు, సామలు, ఆర్కెలు, ఆకుకూరలతో తయారు చేసిన ఎన్నో రకాల రుచికరమైన ఆహార పదార్థాలు ప్రదర్శిస్తూ గర్భిణీలు, పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ  జిల్లాలో పౌష్టికాహార లోపంతో ఎత్తుకు తగ్గ బరువు, సరైన ఎదుగుదల లేని చిన్న పిల్లల సంఖ్యను ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  అయితే జిల్లాను పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్న పిల్లలు, రక్తహీనతతో బాధపడే గర్భిణీల సంఖ్యను సున్నాకు తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.  బాలామృతం, గుడ్ల పంపిణీ , ఐరన్ మాత్రలు ఇవన్నీ తాత్కాలికమైనవని, గ్రామీణ ప్రాంతాల్లో సమతుల్యత కలిగిన ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయని వాటి పోషక విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పించి తినేటట్లు చేస్తే శాశ్వతంగా రక్తహీనత ను అధిగమించవచ్చన్నారు.  ఆ దిశగా అంగన్వాడీ లు ఆశావర్కర్లు, డాక్టర్లు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ  స్యాం మ్యాం పిల్లల సంఖ్యాను ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు  గననీయంగా తగ్గించడం పట్ల స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ సిబ్బందిని అభినందించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను పౌష్టికాహార లోప రహిత జిల్లాగా మార్చడమే లక్హ్యంగా పనిచేయాలని ఆదేశించారు.  అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సమతుల్యంగా ఆహార పదార్థాల పై అవగాహన కల్పించాలన్నారు.  ముందుగా రక్త హీనత గల మహిళలు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలన్నారు.  జాతీయ స్యూటిషన్ సైంటిస్తుల సహకారంతో ఒక గుడ్డులో ఉన్నన్ని పోషక విలువలు కలిగిన చిక్కిలను అరుణ్య ద్వారా తయారు చేయించడం జరిగిందని వీటిని రోజుకు  20 గ్రాముల చొప్పున పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు తినిపించాలన్నారు.  3 నెలల్లో జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు గర్భిణీలు లేకుండా చేయాలని ఆదేశించారు.  ఇది ఒక నిరంతర ప్రక్రియ అని స్థానికంగా దొరికే చిరు ధాన్యాలు, ఆకు కురలను       చిన్న పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలుగా చేసి తినిపించి 6 సంవత్సరాల లోపు పిల్లలకు వచ్చే పౌష్టికాహార లోపమును నివారించవచ్చని పేర్కొన్నారు.   పిల్లలతో పాటు గర్భిణీలు, రక్తహీనత తో బాధపడేవారు ఎవరైనా సరే ఇలాంటి వంటకాలను తినడం వల్ల రక్తహీనత నుండి బయటపడి ఆరోగ్యవంతులుగా మారవచ్చని చూపించారు. ఫుడ్ మేళాలో ప్రదర్శించిన ఆహార పదార్థాలను  పరిశీలించిన కలెక్టర్, శాసన సభ్యులు అంగన్వాడీ టీచర్లను,సూపర్వైజర్లు ను మెచ్చుకున్నారు.  ఈ పదార్థాలు  ఎలా తయారు చేయాలి  ఎందులో ఎంత శాతం పోషక నిల్వలు ఉంటాయో వివరించి అవగాహన కల్పించాలన్నారు.   పోషక విలువలతో కూడిన చిక్కిలను ఆవిష్కరించారు.  పిల్లలకు పంచి పెట్టి మండలాల వారిగా పిల్లలకు ఇచ్చే విధంగా అప్పగించారు.  తెలంగాణ సాంస్కృతిక కళాకారులకు కలెక్టర్, శాసన సభ్యుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫారం ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, డి.డబ్ల్యూ.ఓ వేణుగోపాల్ రావు, జిల్లా వైద్య శాఖ అధికారి రామనోహర్ రావు, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, జడ్పి టిసి లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post