స్థానికుల సంస్థల MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, MLC ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

జిల్లా ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జనరల్ అబ్జర్వర్ విజయ కుమార్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్
000000

7-కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని 7-కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎంఎల్ సి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు పి. విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణతో కలసి సందర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్, హెల్త్ డెస్క్ లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పోలింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ సమయం పూర్తి అయ్యే వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రం లోనే ఉండాలని పోలింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ సమయం ముగిసాక ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేయాలని తెలిపారు.

అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎం పి డి వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధుశర్మ తో కలిసి పరిశీలించారు.

అనంతరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు పి విజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ఎస్ పి సింధు శర్మ తో కలిసి పరిశీలించారు.

తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, సాధారణ పరిశీలకులు విజయ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇన్ఛార్జి ఎస్పి సింధు శర్మతో కలిసి పరిశీలించారు. జిల్లా జడ్పీ కార్యాలయం వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుస లో బారులు తీరగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి వారికి సూచించారు.

Share This Post