స్థానికుల సంస్థల MLC ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పోలింగ్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి

రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ అధికారులు

ఈనెల 10న కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
00000

7-కరీంనగర్ స్థానికసంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరగనున్నందున ఎన్నికల విధులకు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని 7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పోలింగ్ అధికారులకు సూచించారు.

గురువారం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రి తో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ అధికారులు పొందిన శిక్షణ ప్రకారం ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్ లకు సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కి పోలింగ్ అధికారులు, ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకరా కూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉంటారని, ఓటర్లను గుర్తించిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలింగ్ అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఓటర్ కు సింగిల్ గ్లోజ్ (చేతి తొడుగు) అందజేయాలని, ఓటు వేసిన తర్వాత చేతి తొడుగును డస్ట్ బిన్లో వేసెలా చూడాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అధికారులు బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని, మధ్యలో ఎక్కడా కూడా ఆగవద్దని అన్నారు. బ్యాలెట్ బాక్సులను కంపార్ట్మెంట్లో పెట్టవద్దని, పోలింగ్ అధికారులకు ఎదురుగా పెట్టాలని సూచించారు. పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి బస్ లో బందోబస్తుతో నేరుగా కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లోని రిసెప్షన్ సెంటర్ కు తీసుకువచ్చి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని కలెక్టర్ తెలిపారు. ముందుగా ర్యాoడమైజేషన్ నిర్వహించి పోలింగ్ అధికారులకు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.

ఈ ఈ కార్యక్రమంలో, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ సుధాకర్, కలెక్టరేట్ ఏ ఓ లక్ష్మారెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post