స్థానిక క్యాడర్ కేటాయింపులలో బాగంగా జిల్లాలోని వివిధ శాఖలలో జరిగిన కేటాయింపుల వివరాల పై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు

పత్రిక ప్రకటన                                                                    తేది 24.12.2021

స్థానిక క్యాడర్        కేటాయింపులలో బాగంగా జిల్లాలోని వివిధ శాఖలలో జరిగిన కేటాయింపుల వివరాల పై  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్ల తో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ వివిధ శాఖలలో ఉన్న క్యాడర్ స్ట్రేంత్ , పని చేస్తున్న ఉద్యోగులు, శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరగాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం శాఖలలో ఉన్న ఖాళీలను చూపించి,  సీనియారిటీ కి ప్రాధాన్యత  ఇచ్చి కేటాయింపులు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.  స్పెషల్ కేసులు , వితంతువుల సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అభ్యంతరాలను తెలుపడానికి ఒక ఫాం ఉంటుందని, ఫాం ద్వారా అభ్యంతరాలను స్వీకరించి, ఖాళీలను చూపించి కేటాయింపులు చేయాలని, ఈ ప్రక్రియ మొత్తం వారం రోజులలో పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కేటాయింపు ప్రక్రియ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా , ఆప్షన్ ఫాం, సీనియారిటీ జాబితా, ఖాళీల జాబితా అన్నిటిని పరిశీలించిన తరవాతే పోస్టింగ్ ఇవ్వాలని అన్నారు. జిల్లాలోని శాఖల వారిగా ఉద్యోగుల వివరాలు, ఖాళీల వివరాలు, నూతనంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగుల వివరాల గురించి జిల్లా  అధికారులతో  రివ్యూ చేశారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు, గద్వాల్ , అయిజ, ఆలంపూర్, వడ్డేపల్లి, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

 

 

 

Share This Post