స్థానిక క్యాడర్ కేటాయింపులలో బాగంగా జిల్లాలోని వివిధ శాఖలలో జరిగిన జిల్లా కేడర్ కేటాయింపుల ననుసరించి నల్గొండ జిల్లాకు బదిలీ పై కేటాయించిన వివిధ శాఖల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కౌన్సిలింగ్ నిర్వహించి ఉత్తర్వులు అందచేశారు

.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయాదిత్య భవన్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు,ఉద్యోగుల తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో స్థానిక కేటాయింపు లో భాగంగా జిల్లా కేడర్ పోస్టుల లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ని ఇతర జిల్లాల నుండి నల్గొండ జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల కు ఆయా శాఖల లో ఖాళీలు,సీనియారిటీ, ఉద్యోగుల ప్రాధాన్యత ఆప్షన్ లు,స్పెషల్ కేటగిరి ఉద్యోగుల ను ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి టి.ఎన్. జి.ఓ.సంఘం సమక్షంలో శాఖల వారిగా కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశం లో టి.యన్. జి.ఓ.జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్,జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతి లాల్ పాల్గొన్నారు.
స్థానిక క్యాడర్ కేటాయింపులలో బాగంగా జిల్లాలోని వివిధ శాఖలలో జరిగిన జిల్లా కేడర్ కేటాయింపుల ననుసరించి నల్గొండ జిల్లాకు బదిలీ పై కేటాయించిన వివిధ శాఖల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కౌన్సిలింగ్ నిర్వహించి ఉత్తర్వులు అందచేశారు

Share This Post