స్థానిక నాయకులూ టీకా విషయంలో సహాయ సహకారాలను అందించండి – శర్మన్ జిల్లా కలెక్టర్

బుధవారం సంతోష్ నగర్ డివిజన్ కు చెందిన హస్నాబాద్ బస్తీలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్  ఇంటింటికి తిరిగి టీకాల పై అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీకా విషయంలో పాతబస్తీలో అపోహలను దూరం చేసేందుకు స్థానిక నాయకులూ డివిజన్ కార్పొరేటర్లు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య  అధికారులు, కార్యకర్తలు ఇంటింటి సర్వేలో తమకు ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ కు వివరించారు. పాతబస్తీలో చాల వరకు స్థానికులు టీకా విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు సహకరించడం లేదని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఆయన స్వయంగా ఇంటింటికి తిరిగి టీకా విషయం గురించి వాకబు  చేసారు.  కోవిద్ టీకా విషయంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను గురించి జిల్లా వైద్య అధికారి వెంకటి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

 

            ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు వెంకటి, డిఐఓ రాజశ్రీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post