స్థానిక సంస్థలకు సంబంధించిన శాసన మండలి 9 నియోజిక వర్గ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రిక ప్రకటన                                                         తేదీ 15-11-2021

స్థానిక సంస్థలకు సంబంధించిన శాసన మండలి 9 నియోజిక వర్గ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు పొలిటికల్ పార్టీ ల ప్రతినిధులు, ఎంపిడిఓ లు, తహసిల్దార్ల తో ఎర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణలో  ఉన్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికల నిర్వహించేందుకు  భారత ఎన్నికల సంఘం  షెడ్యుల్ విడుదల చేసిందని, నవంబర్ 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని  ఆయన తెలిపారు.  నవంబర్ 16 నుండి నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జిల్లా పరిషత్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 14న కౌంటింగ్ బాలుర జూనియర్ కళాశాల మహబూబ్ నగర్ నందు నిర్వహించడం  జరుగుతుందని  తెలిపారు. జిల్లా ప్రాదేశిక సభ్యులు , మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మున్సిపల్ కౌన్సిల్లర్ లు గల   232 మంది ఓటర్ ల జాబితా ను విడుదల చేసామని తెలిపారు. నవంబర్ 23 న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

జిల్లాలో పకడ్భందిగా  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అన్నారు.   పొలిటికల్ పార్టీ లు బైక్ ర్యాల్లిలు , సమావేశాలు నిర్వహించుటకు పోలీస్ వారితో  ముందస్తు అనుమతి తీసుకోవాలని , ఎన్నికలలో ఓటర్ లను గుర్తించడానికి ఎంపిడిఓ లు, తహసిల్దార్లు, మున్సిపల్ కమీషనర్ లు, ఉంటారని తెలిపారు.

సమావేశం లో జెడ్పి సిఇ.ఓ విజయ నాయక్, ఎంపిడిఓ లు, , తహసిల్దార్లు, టి.ఆర్.ఎస్, సి.పి.ఐ, ఐ.ఎన్.సి, బి.జె.పి, పార్టీ ల ప్రతినిధులు, మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

Share This Post