స్థానిక సంస్థలకు సంబంధించి రంగారెడ్డి శాసన మండలి నియోజక వర్గ ఎన్నికలకు మంగళ వారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ తెలిపారు.

స్థానిక సంస్థలకు సంబంధించి రంగారెడ్డి శాసన మండలి నియోజక వర్గ ఎన్నికలకు మంగళ వారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ తెలిపారు. నామినేషన్లను ఈ నెల 16 నుండి 23 వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని నామినేషన్ లు పని రోజులలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగదని తెలిపారు. 24 న పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు..

డిసెంబర్ 10 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు ఉంటుందని 1179 ఓటర్లు ఉన్నారు. అందులో స్త్రీలు 627, పురుషులు 552 ఉన్నారన్నారు. పోలింగ్ కొరకు రాజేంద్ర నగర్, తాండూరు, వికారాబాద్, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహింపట్నం, కందుకూరు, చేవేళ్ల లో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, బ్యాలట్ పేపర్ ఆధారంగా పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఇట్టి శాసన మండలి ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల పరిషద్ ప్రాదేశిక సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారని 1179 ఓటర్లు గల ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం నాడు విడుద చేశారు. ఇట్టి జాబితా పై ఈ నెల 20 వరకు క్లైమ్స్ స్వీకరిస్తామని, 21,22 తేదీలలో స్క్రూటినీ చేసి 23 న తుది జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.

Share This Post