స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు* # జిల్లా మహిళా సమాఖ్య భవనం(డి.ఆర్.డి.ఓ)లో కౌంటింగ్ నిర్వహణ కు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

 నల్గొండ,నవంబర్ 27.   నల్గొండ స్థానిక సంస్థల శాసన మండలి నియోజక వర్గ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.శనివారం జిల్లా కేంద్రంలో టి.టి.డి సి.జిల్లా మహిళా సమాఖ్య(డి.ఆర్.డి.ఓ) భవనం లో డిసెంబర్  14 న కౌంటింగ్ నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లు పరిశీలించి కలెక్టర్ సూచనలు జారీ చేశారు.డిసెంబర్10 న పోలింగ్ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా డివిజన్ కేంద్రాల నుండి పోలింగ్ మెటీరియల్ స్వీకరణకు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు,పోలింగ్ మెటీరియల్,పోలింగ్ బాక్స్ లు,భద్రపరిచేందుకు  స్ట్రాంగ్ రూం కు సి.సి.ఏర్పాట్లు,భద్రత ఏర్పాట్లు,కౌంటింగ్ నిర్వహణ కు విధుల్లో ఉన్న అధికారులు,సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లు కు ప్రవేశం, బారికెడింగ్, పార్కింగ్, మీడియా రూం ఇతర ఏర్పాట్లు పై చర్చించి అధికారులకు సూచనలు చేశారు.  కౌంటింగ్ కేంద్రం లో గుర్తింపు కార్డు కలిగి కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి అయినట్లు దృవీరకరణ చూపించిన వారినే ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ తో ఆర్.డి. ఓ జగదీశ్వర్ రెడ్డి, డి.ఆర్.డి. ఓ.కాళిందిని,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి, డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్,తహశీల్దార్ నాగార్జున,కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి,ఎన్నికల డి.టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.
————-//—————సహాయ సంచాలకులు,సమాచార పౌర సంబంధాల శాఖ,నల్గొండ చే జారీ చేయనైనది

Share This Post