స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి::రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

ప్రచురణార్థం……1 తేది.08.12.2021
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి::రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్
జగిత్యాల 08, డిసెంబర్ 2021: డిసెంబర్ 10 న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు , ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10 న పోలింగ్ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫొన్లను అనుమతించకూడదని తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారధర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించుటకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ల కు సూచించారు. పోలింగ్ సామాగ్రి తో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు మరియు పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్ లతో రిసెప్షన్ సెంటర్ కు వచ్చేటప్పుడు బందోబస్తుతో రావాలని అన్నారు.
ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల లో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయోలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఏఎన్ఎం లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
అనంతరం జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాలను జగిత్యాల ఎం.పి.డి.ఓ. మరియు కొరుట్ల ఎం.పి.డి.ఓ. కార్యాలయలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ , రెవెన్యూ,మరియు పొలీస్ అధికారులుతో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలుజారీచేశారు. రేపటి లోగా పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్ మరియు పర్యటనలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఆర్.డి.ఓ.లు, తసీల్ధార్లు, ఎం.పి.డి.ఓ.లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి::రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

జిల్లా పౌర సంబంధాల అధికారి,జగిత్యాల జిల్లా ద్వారా జారీచేయనైనది.

Share This Post