స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు.

వరంగల్
నవంబర్ 11
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వరంగల్ లో  ఎన్నికల  విధులకు గాను జిల్లా కలెక్టర్ వివిధ శాఖలకు  సంబందించిన  జిల్లా స్థాయిలో అధికారులను  నోడల్ అధికారులుగా  నియమించారు.
ఈ సందర్భంగా కలెక్టర్   గురువారం తన చాంబర్లో నోడల్ అధికారులతో  రివ్యూ ఏర్పాటు చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు పలు విధులకు నియమించిన నోడల్ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ స్టేషన్ల బాధ్యతను జెడ్పీ సీఈఓ రాజారావుకు, మెటీరియల్ మేనేజ్మెంట్ కు నోడల్ అధికారిగా ఇండస్ట్రీ జిఎం నరసింహమూర్తి, మాడల్  కోడ్ అమలు పర్యవేక్షణకు నరేష్ కుమార్,
కౌంటింగ్ ఇంచార్జ్ మరియు అబ్జర్వర్ ల కొరకు ఆర్డీవో వరంగల్ మహేందర్ జి, మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఇన్చార్జిగా డి పి ఆర్ ఓ బి పల్లవి, మెటీరియల్ కొనుగోలు టిఎ మరియు డిఎ చెల్లింపు  బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేంద్రనాథ్, కోవిడ్- 19  నిబంధనలు సరిగ్గా అమలు అయ్యేందుకు డిఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ ,వెహికల్ ఏర్పాటుకు ఆర్టిఏ ఆఫ్రెన్ సిద్ధికి లను నోడల్ అధికారులుగా కలెక్టర్ నియమించారు.
పూర్తి కోఆర్డినేషన్ తో నోడల్ అధికారులు అందరూ ఎన్నికలలో తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్, ఎన్నికల బాధ్యతల నిర్వహణకు నియమించిన నోడల్  అధికారులు అందరూ పాల్గొన్నారు.

Share This Post