స్థానిక సంస్థల ఎం. యల్.సి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున మోడల్ కోడ్ కండక్ట్ 9 వ తేదీనుండి అమలులో ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నిక ల అధికారి శశాంకా గోయల్ అన్నారు. బుధవారం ఎన్నికల నిర్వహణ లో భాగంగా జిల్లా కలెక్టర్ లతో హైద్రాబాద్ నుండి సంబంధిత అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ను పటిష్టoగా అమలు పరచాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓటర్ లిస్ట్ ను తయారుచేసుకోవాలని అలాగే ఇతర ఎన్నికల నిర్వహణకు సంబందించిన ఏర్పాట్లను వెంటనే చేపట్టి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఏర్పాట్లకు సంబందించిన ప్రతిపాదనలు పంపాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 10 న జరిగే స్థానిక సంస్థల ఎం. యల్.సి. ఎన్నికలు జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పతిష్టoగా అమలు చేయనున్నట్లు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, ఎలక్షన్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పులి సైదులు, నాయబ్ తహసీల్దార్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

