*స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి – ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

*

డిసెంబర్ 10 వ తేదీన నిర్వహించబోయే స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ కి ఒకరోజు ముందుగానే సంబంధిత జిల్లా కలెక్టరేట్ లలో రిపోర్ట్ చేయాలని, అక్కడ పోలింగ్ సామగ్రిని స్వీకరించి, అదేరోజు నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాక పోలింగ్ కు అవసరమగు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. 10వ తేదీ ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ ఉంటుందని అన్నారు. ఓటింగ్ లో పాల్గొనే ప్రతి ఓటరుకీ సంబంధిత స్థానిక సంస్థల అధికారుల ద్వారా గుర్తింపు కార్డులు అందజేస్తామని అన్నారు. సాధారణ ఎన్నికలలో లాగా కాకుండా ఈ ఎన్నికలలో ఓటర్లు ప్రిఫరెన్స్ విధానం ద్వారా ఓటు వేస్తారని తెలిపారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత పోలింగ్ సిబ్బంది అందరూ పోలైన బ్యాలెట్ బాక్సులు మరియు ఎన్నికల పత్రాలను తీసుకునివారి రూట్ అధికారులతో పాటు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణం రోడ్డులో గల జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయం డీఆర్డీవో (టిటిడిసి) నందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లో అందజేయాలని అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోతీలాల్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, బాలు, ఎన్నికల సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post