స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలపై అఖిలపక్ష నాయకులతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన      తేది:11.11.2021, వనపర్తి.

త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికలకు అఖిలపక్ష నాయకులు సహకరించి, ఎన్నికలు సజావుగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అఖిలపక్ష నాయకులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 శాసన మండలి ఎన్నికలకు గాను అఖిలపక్ష నాయకులతో చర్చించారు. ఈ నెల 9న నోటిఫికేషన్ వెలువడినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. వనపర్తి జిల్లాలో 14 మంది జడ్పీటీసీలు, 125 మంది ఎంపీటీసీలు, 80 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారని, 1 మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారని, మొత్తం 220 మంది సభ్యులుగా ఉన్నట్లు ఆమె సూచించారు.
స్థానిక సంస్థల శాసన మండలి కోటా ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఫైనలైజ్ చేయుటకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు పూర్తవుతున్న ట్లు జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్వహించుటకు ఆర్డీవో కార్యాలయం అనుకూలమని నిర్ధారించారు. వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో జరిగే ఎన్నికలకు సంబంధించి అఖిలపక్ష నాయకులు అందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారని, ఏ పార్టీ అయినా వారి కార్యక్రమాలు చేపట్ల బోయే ముందు ముందస్తుగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని, ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారి (రిటర్నింగ్ అధికారి) అనుమతి ఇస్తేనే కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ధర్నాలు, నిరసనలు తెలుప కూడదని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సిపిఐ పార్టీ ఎండి జబ్బార్, ఎన్ పరమేశ్వర్ ఆచారి, ఐ ఎన్ సి టీ.శంకర్ ప్రసాద్, బిజెపి పి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ గట్టు యాదవ్, బిఎస్పి చిరంజీవి, టి డి ఎస్ ఎండి ఖాదర్ భాషా, బిజెపి తిరుమలయ్య, టిడిపి సయ్యద్ జమీల్, టిఆర్ఎస్ కోళ్ల వెంకటేష్, ఎస్పి  రాములు, వైఎస్ఆర్ సి పి కె వెంకటేశ్వర్లు, పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post