స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పై ROలు,AROలు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పగడ్బందీగా అమలు చేయాలి

శుక్రవారం ఉదయం 10 గంటల లోపు ఓటర్ల జాబితా ఇవ్వాలి

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం…
000

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డిఓలు, జడ్పీ సీఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సి స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్ రోల్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఓటర్ల జాబితా ఇవ్వాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు కలిగి ఉంటారని వారి జాబితా లను అందించాలని తెలిపారు. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ కరీంనగర్ లోనే ఉంటుందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున ఈనెల 10వ తేదీ నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎం సి సి కోడ్) అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశముల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులను తరుచుగా సబ్బుతో గాని, సానిటైజర్ తో గాని శుభ్రపరుచుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులలో పాల్గొను సిబ్బంది అందరూ రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకొని ఉండాలని కలెక్టర్ తెలిపారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు తప్పకుండా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఎన్నికల తనిఖీ బృందాలను, ప్లైయింగ్ స్కాడ్ లను, స్టాటిక్ టీములను, వీడియో వీవింగ్ టీములను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Share This Post