వార్త ప్రచురణ
ములుగు జిల్లా: (ఏటూరు నాగారం)
తేదీ 17.09.2021.
స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఏటూరునాగారం లో శుక్రవారం రోజున ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పైన అవగాహన సదస్సుకు వచ్చిన వారి కోసం అదనపు కలెక్టర్ ఆదర్శ సురబి ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేయిoచి 18 సంవత్సరాలు నిండి న యువతీ యువకులకు 24 మంది కి వ్యాక్సిన్ ఇప్పించడం జరిగినదని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ వ్యాక్సిన్ వలన ఎంతో మంది కరోనా భారీ నుండి రక్షింప పడ్డారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ తోటివారికి వ్యాక్సిన్ వేసుకునేలా చైతన్యం పరచాలి అని వారు అన్నారు. మన పక్క వాళ్ళు బాగుంటే నే మనం బాగుంటాం అని వారు అన్నారు. కరోనా రహిత జిల్లా గా మార్చుటకు మనమందరం ముందుండాలని అదనపు కలెక్టర్ అన్నారు. స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ ను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.