స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా ఇప్పటి వరకు ఓటర్ గుర్తింపు కార్డుకై వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను సూచించారు

స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా ఇప్పటి వరకు ఓటర్ గుర్తింపు కార్డుకై వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే  విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను సూచించారు.  శనివారం ఉదయం స్పెషల్ సమ్మరి రివిజన్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్ల తో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారం 6 ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుల కై జిల్లాలో వచ్చిన దరఖాస్తులను బూత్ లెవల్ అధికారుల ద్వారా పరిశీలన జరిపించి అర్హులైన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు.  ఇప్పటికే గుర్తింపు కార్డు ఉండి మార్పు చేర్పులకు వచ్చిన దరఖాస్తులు అదేవిధంగా మరణించిన వారి పేర్లను నిబంధనలు పాటిస్తూ ఎన్రోల్మెంట్ జాబితా నుండి తొలగించాలన్నారు.      ఈ.వి.యం గోదాములను పరిశీలిస్తూ ఉండాలని, కొత్తగా నిర్మితమైన గొదాములకు మార్చాలని సూచించారు.  ఎక్కడైనా ఇంకా ఇ వి.యం గోదాముల నిర్మాణం పూర్తి కాకుంటే త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు.   ఓటర్లను అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆక్టివిటీలను చేపట్టాలని తెలియజేసారు.  ఎలక్షన్ నిధులపై సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి హరిచందన  మాట్లాడుతూ జిల్లాలో  పెండింగ్ లో దరఖాస్తులు  వారం రోజుల్లో పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. EVM ల గోదం ను త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఒలతో మాట్లాడుతూ    ఓటరు గుర్తింపు కార్డు కై ఇప్పటి వరకు వచ్చిన  ఫారం-6  దరఖాస్తులను  వారం రోజుల్లో పరిష్కరించాలని  ఆర్.ఓ లను ఆదేశించారు.  బి.యల్.ఓ లకు వచ్చిన నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యిందా లేదా అని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించడమ్ పెండింగ్ ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఫారం 6, 6ఏ, 7 లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  స్వీప్ యాక్టివిటి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డి.ఈ.ఓ ను సూచించారు.

Share This Post