“స్పెషల్ సమ్మరి రివిజన్ – 2022” ముసాయిదా ఓటరు జాబితాపై వీడియో కాన్ఫెరెన్సు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన              వనపర్తి జిల్లా
తేది:27.10.2021

“స్పెషల్ సమ్మరి రివిజన్ 2022” ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన విడుదల చేసేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్.ఎస్.ఆర్-2022 పై ఆయన వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ సెప్టెంబర్, 30వ. తేదీ వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి, నవంబర్ 1వ. తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని ఆయన సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేరు తప్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి, సరిచేసే కార్యక్రమం చేపట్టాలని ఆయన  తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి, 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా ఆయన సూచించారు.
ఓటర్లు ఇండ్లు మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉన్నట్లయితే, లేదా పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసినవి ఉన్న ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చన్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోడానికి గరుడ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ ఎలా ఉపయోగించాలో  బూతు లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఇ. వి.యం లు పాత గోదాముల నుండి కొత్త గొదాములకు మార్చాలని తెలిపారు. ఇంకా నిర్మాణం పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇ.వి.యం.ల భద్రత పై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్నీ జిల్లాల్లో స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు.
జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి యువకులు ఆన్లైన్ ద్వారా గాని, ఫారం 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పేరులను నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం గావించాల్సిందిగా సూచించారు. గత ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన ఎన్నికల బిల్లులు, డి.సి. బిల్లులు పెట్టడం పెండింగ్ ఉంటే సత్వరమే దాఖలు చేయాలని తెలియజేసారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్లు మార్పుకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.  నవంబర్ 6,7, 27, 28వ తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో సంభందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి  ద్వారా జారీ చేయనైనది.

Share This Post