స్పెషల్ సమ్మరి రోల్స్ (SSR) రివిజన్ 20-22 సంబంధించి డ్రాఫ్టు రోల్స్ ( ఓటరు జాబితా)లు తేది 1-11-2021 నాడు ప్రచురించ బడతాయని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                తేది 30-10-2021

స్పెషల్ సమ్మరి రోల్స్ (SSR) రివిజన్ 20-22  సంబంధించి డ్రాఫ్టు రోల్స్ ( ఓటరు జాబితా)లు తేది 1-11-20 21 నాడు ప్రచురించ బడతాయని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

శనివారం సాయంత్రం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అన్ని పార్టీల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  డ్రాప్ట్ రోల్స్ పై ఎలాంటి క్లెయిమ్స్, అబ్యాంతరాలు ఉనట్లయితే  1-11-20 21 నుండి 30-11-20 21  వరకు సమర్పించుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. అదేవిదంగా తాజా ఓటర్ల జాబితా 5-1-2022 న ప్రచురించ బడుతుందని తెలిపారు.  ఓటరు హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా లిస్టు ఫైనల్ చేసుకోవాలన్నారు.  ఓటర్ల పేర్లు ఉన్న ఏరియాకు దగరలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని  పొలిటికల్ పార్టీ  సభ్యులు కోరారు.

సమావేశంలో ఆర్ డి ఓ రాములు, ఏ ఓ మధుసూదన్, సుభాన్ ఖాన్, నరేష్, సత్యనారాయణ రెడ్డి , సి పి ఐ ,బిజెపి, ఐ ఎన్ సి , టి ఆర్ ఎస్ , వై ఎస్ ఆర్ సి పి, పార్టీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

 

Share This Post