స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో వచ్చిన వివిధ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో వచ్చిన వివిధ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్పెషల్ సమ్మరీ రివిజన్ దరఖాస్తుల పరిష్కారం,గరుడ యాప్ లో దరఖాస్తుల నమోదు, లాజికల్ ఎర్రర్స్ సవరణ తదితర అంశాలపై నియోజక వర్గం వారీగా కలెక్టర్ సమీక్షించారు.

ఓటర్ల జాబితాలో లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు అన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి గరుడ యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

టెక్నికల్ ఇబ్బందులు ఏవైనా ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి,రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్స్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post