పత్రికా ప్రకటన తేది:07.12.2022, వనపర్తి.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం స్పెషల్ సమ్మరీ రివిజన్ ముసాయిదా ఓటర్ జాబితాను పకడ్బందీక రూపొందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు. బుధవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్, ఓటరు నమోదుపై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని ఆమె తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పకడ్బందీగా తయారుచేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 37 వేల మంది ఉండగా, ముసాయిదా జాబితాలో 11 వేల మంది తగ్గడం జరిగిందని ఆమె సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ ద్వారా ఒకే మాదిరిగా ఉన్న ఓటర్ల ఫోటోలను గుర్తించి తొలగించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 8 వేల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని ఆమె తెలిపారు. 15 రోజులలో లోపల 18 సంవత్సరాలు పూర్తయిన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలని, చనిపోయిన వారిని గుర్తించి జాబితా నుండి తొలగించి జాబితా సిద్ధం చేయాలని ఆమె తెలిపారు. వనపర్తి జిల్లాలో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కమిషన్ ఆదేశాల ప్రకారం 18, 19 సం. పూర్తయిన ఓటర్లు 15 వేల 500 మంది ఓటర్లు నమోదు అయి ఉండాలని, ఇందులో మన జిల్లా కేవలం 4.33 శాతం (674) మాత్రమే నమోదు చేయటం జరిగిందని, రాష్ట్రంలో చాలా తక్కువగా నమోదు ఉన్నదని ఆమె తెలిపారు. ఇంకా 14 వేల 859 మంది ఓటర్లను నమోదు చేయవలసి ఉన్నదని ఆమె అన్నారు. 20 నుండి 29 సం.లు పూర్తైన ఓటర్లు 71,093 మంది నమోదు అయి ఉండాలని, ఇందులో 41 వేల 250 మంది నమోదు చేయటం జరిగిందని, ఇంకా 30 వేల మంది ఓటర్లు నమోదు చేయవలసి ఉన్నదని ఆమె సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఫామ్ -6 ద్వారా నూతన ఓటర్లను తప్పని సరిగా నమోదు చేయాలని, ఫామ్ – 6 (బి) ద్వారా ఆధార్ సీడింగ్ చేయాలని ఆమె తెలిపారు. జనవరి 5వ తేది లోపల ప్రత్యేక అధికారులు, బి.ఎల్. ఓ.లు, సూపర్వైజర్ లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఓటర్ నమోదు వివరాలను గరుడ యాప్ లో నమోదు చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
——————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.