స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన.    తేది:1.11.2021, వనపర్తి.

ఒక ఓటరుకు కావాల్సిన అన్ని వివరాలు మొబైల్ యాప్ లో చూసుకోవచ్చని, ప్రజాస్వామ్య పారదర్శకతకై భారత ఎన్నికల సంఘం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పబ్లికేషన్ చేసిన ఎస్ ఎస్ ఆర్ 2022 డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పై లో  జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ గా పెరు నమోదుకు గాని, ఓటరు ఒక  అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి మారినప్పుడు కేవలం మొబైల్ యాప్ లో నమోదు చేసుకునే సులువైన యాప్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిందన్నారు.  చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించేందుకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తమ పేర్లు జాబితాలో  ఉన్నాయా లేవా అనే వివరాలు సైతం చూసుకోవచ్చన్నారు.  యువకులు ఈ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
వనపర్తి నియోజకవర్గంలో 290 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 15.1.2021 నాటికి 2,47,396 మంది ఓటర్లు ఉన్నారని, 706 మంది కొత్తగా ఓటర్లు నమోదు అయ్యారని, 2,421 మంది ఓటర్లను తొలగించటం జరిగిందని, 1.11.2021 నాటికి మొత్తం ఓటర్లు 2,45,690 మంది నమోదు అయినట్లు ఆమె తెలిపారు.
5. 1. 2022 నాడు చివరి ఓటర్ డ్రాఫ్ట్  జాబితా విడుదల అవుతుందని, ఈ నెల 6,7, 27 ,28 తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేయనున్నట్లు కొత్తగా నమోదు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 5.1.2022 వ. తేదీన తుది జాబితా సిద్ధం అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ప్రతినిధులు వెంకటేష్, పరశురాం, వైయస్సార్ పార్టీ తరఫున వెంకటేష్, సిపిఎం తరపున ఎండీ జబ్బార్, ఎస్ పి పార్టీ తరఫున జె.రాములు, సీపీఐ తరపున చంద్రయ్య, కాంగ్రెస్ ప్రతినిధి తిరుపతయ్య, టిడిపి తరఫున జమాలుద్దీన్, ఎంఐఎం పార్టీ ఖయ్యూం, బి ఎస్ పి పార్టీ తరఫున చిరంజీవి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

——————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post