స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి తుది ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                  తేదీ .05.01. 2022

స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి తుది ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు రాజకీయ పార్టీలతో  ఏర్పాటు చేసిన సమావేశం లో తుది ఓటర్ జాబితా ప్రకటించి ఓటర్ల వివరాలను తెలిపారు . ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు లో  బాగంగా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశిలించి , ఎలాంటి ఆక్షేపణలు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని రెండు నియోజికవర్గాల్లో మొత్తం 458728 మంది ఓటర్లు ఉన్నారని, 79 నెం. గద్వాల్ నియోజికవర్గం లో మొత్తం  237093 మంది ఓటర్లలో 117451 పురుషులు, 119637 మహిళలు, 5 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. 80 నెం. ఆలంపూర్ నియోజికవర్గం లో మొత్తం ఓటర్లు 221635 మంది ఉన్నారని, అందులో 110744 మంది పురుషులు, 110886 మంది మహిళలు, 5 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. గద్వాల్ నియోజికవర్గం లో 30 మంది సర్వీస్ ఓటర్లు , ఆలంపూర్ నియోజికవర్గం లో 54 మంది సర్వీస్ ఓటర్లు, రెండు నియోజికవర్గాల్లో మొత్తం 84 సర్వీస్ ఓటర్లు, గద్వాల్ నియోజికవర్గం లో  ఇద్దరు ఎన్.ఆర్.ఐ. ఓటర్లు, అలంపూర్ లో ముగ్గురు ఎన్.ఆర్.ఐ ఓటర్లు , జిల్లాలో  మొత్తం 5 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు ఉన్నారని అన్నారు.

సమావేశం లో ఆర్.డి.ఓ రాములు, మదన్ మోహన్, ఎం.ఎ సుబాన్ టి.ఆర్.ఎస్, బి.సురేష్ బాబు బి.ఎస్.పి , కబీర్ దాస్ నర్సింహులు బి.జె.పి, పటేల్ ప్రభాకర్ రెడ్డి ఐ.ఎన్.సి,  సి.పి.ఐ బి.ఆంజనేయులు, వై.ఎస్.ఆర్.సి.పి అతికుల్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

Share This Post