స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు

స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు

స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.
బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీలు నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను డిస్పోస్ చేసి, తుది ఓటర్ జాబితా ను ప్రచురించాలని అన్నారు. జనవరి 5 నాడు అన్ని గ్రామాలలో తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని అధికారులకు ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం చేసి , యాప్ వినియోగం పై వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతినెల కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలించి , ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ఈ.వి.ఎం. లను కొత్త గోడౌన్ లకు తరలించాలని, ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎలక్షన్ సెక్షన్ తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post