స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.

స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.

బుధవారం  అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమం పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు  నమోదు చేసుకునే విధంగా స్వీప్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.

ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్బులను సమర్థవంతంగా  నిర్వహించాలని, తద్వారా యువ ఒటర్లు, ఫ్యూచర్ ఓటర్లలో అవగాహన పెరిగి ఓటరుగా   అధిక సంఖ్యలో నమోదు చేసుకోవడానికి  అవకాశముంటుందని అన్నారు.  ఓటర్ల జాబితాను గరుడ యాప్ లో నమోదు చేయాలన్నారు.  ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఓటరు జాబితాలో  చేర్చడంతో పాటు, మార్పులు,చేర్పులు,  డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారి పేర్లు తొలగించి  జనవరి 5, 2022 నాటికి  పకడ్బందీగా తుది జాబితా సిద్ధం  చేసి ప్రచురించాలని కలెక్టర్లకు సూచించారు.  ఇట్టి జాబితాను  అన్ని గ్రామాలలో ప్రదర్శించాలని సూచించారు.  18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను  ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా  నమోదు  చేసే ప్రక్రియను  నిరంతరంగా  కొనసాగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన  గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం చేసి ,  యాప్ వినియోగం పై వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  ప్రతినెల కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలించి , ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.  జిల్లాలోని ఈ.వి.ఎం. లను కొత్త గోడౌన్ లకు తరలించాలని, ప్రతి నెల ఈవీఎం గోదాములను  తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు.

కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 51,730  మంది యువత నూతన ఓటరుగా నమోదు చేసుకున్నారని, జాబితా నుండి డూప్లికేట్, మరణించిన 9484  పేర్లు తొలగించమని అన్నారు. లాజిక్ ఎర్రర్, పెండింగ్ క్లెయిమ్స్ ను పరిశీలించి జనవరి 5 న తుది జాబితా ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ ,లింగ్య నాయక్, డి ఈ ఓ ,ఎస్ యస్ ప్రసాద్, ఎలక్షన్ సెల్ సూపర్డెంట్ పుష్యమి ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post