స్పెషల్ సమ్మరీ రోల్స్ రివిజన్ (SSR)-2022 లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు

స్పెషల్ సమ్మరీ రోల్స్ రివిజన్ (SSR)-2022 లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

శుక్రవారం జిల్లా లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించే పోలింగ్ స్టేషన్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా పట్టణం లోని వేణు కాలనీ లో గల ప్రభుత్వ ప్రైమరీ పాటశాలలో ఉన్న ,215, 216, 303, పోలింగ్ స్టేషన్ లు,  మరియు ఎం.పి.డి.ఓ కార్యాలయం లో 257 పోలింగ్ స్టేషన్ లను తనికి చేశారు. ఇప్పటివరకు ఏమైనా ధరకాస్తులు వచ్చాయా, 6,6A,7,8,8A ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ స్టేషన్ కు  వచ్చే ప్రజలకు పూర్తి సమాచారం అందించి, వారికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్, హెల్ప్ లైన్ నెం. పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్బంగా ఈ  నెల 6 వ తేదిన   జరిగే కార్యక్రమానికి ఎలక్షన్ అబ్జర్వర్ కె. మానిక రాజ్, ఐ.ఎ.ఎస్, వస్తున్నారని, గద్వాల్, అలంపూర్ నియోజికవర్గాలలోని పోలింగ్ స్టేషన్ లను సందర్శిస్తారని తెలిపారు.

అనంతరం  కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు మధ్యాహ్నం 3:30 గంటలకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎ.ఈ.ఆర్.ఓ లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమం లో ఎం.ఆర్.ఓ లక్ష్మి, డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, నరేష్ కుమార్, సురేష్, బి.ఎల్.ఓ లు, తదితరులు ఉన్నారు.

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.

 

 

Share This Post