స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ ని ఆదర్శం గా ప్రతీ ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు .

ప్రచురునార్ధం

వరంగల్

స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ ని ఆదర్శం గా ప్రతీ ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు .

శనివారం నాడు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆచార్య జయశంకర్ సార్ 88వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి వెనుకబడి పోతుందని ఆవేదన చెంది తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశలు పాటు పడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు

ఆచార్య జయశంకర్ సార్ ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు సంక్షేమ పథకాలు ప్రజలకు దరిచేరే విధంగా పట్టుదలతో పని చేయాలని తెలిపారు

అంతకుముందు వరంగల్ ఏకశిలా పార్క్ వద్ద ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి జి.&ƒ‹T« jáT+.d¾ కమిషనర్ ప్రావీణ్య తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, కలెక్టరేట్ ఏవోవిశ్వనారాయణ , ఆర్డిఓ మహేందర్ జి కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post