స్మశాన వాటికలు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

స్మశాన వాటికలు త్వరితగతిన పూర్తి చేయాలి…

మహబూబాబాద్ ఆగస్టు 23.

స్మశాన వాటిక లను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 380 స్మశాన వాటిక ల పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 380 స్మశాన వాటిక లకు గాను 377 నిర్మించడం జరిగిందని వివరించారు కురవి మండలంలోని lingya తండా డోర్నకల్ మండలం లోని గుర్రాల కుంట తండా పాత దుబ్బ తండ స్మశాన వాటికలు స్థల కొరత వలన నిర్మాణ పనులు చేపట్టలేక పోయామని ప్రస్తుతం ఆ పనులు కూడా కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 74% గా పూర్తయిన స్మశాన వాటిక పనులు 85% తో ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ ఈ ఈ సురేష్ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ ట్రాన్స్కో డి ఈ సునీత దేవి మిషన్ భగీరథ ఈ ఈ కృష్ణారెడ్డి పంచాయతీ రాజ్ డీ ఈ ఈ లు మహేష్ ప్రవీణ్ కుమార్ ఏ ఈ ఈ లు పాల్గొన్నారు
————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post