స్మశాన వాటికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి – అదనపు కలెక్టర్ మను చౌదరి

ఇంకా పూర్తికాని చివరి దశలో ఉన్న 34 స్మశాన వాటికలను త్వరిత గతిన పూర్తి చేసి, నిధులను వెంటనే చెల్లించేలా ఆన్లైన్ పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్మశాన వాటికల నిర్మాణాల పనితీరును సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 389 స్మశాన వాటిక లకు గాను 355 నిర్మించడం జరిగిందని వివిధ కారణాలతో ఆలస్యమైన 34 స్మశాన వాటికలు వివిధ దశల నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…..
పూర్తయిన స్మశాన వాటిక పనుల బిల్లుల నమోదులు ఎలాంటి జాప్యం లేకుండా 100% చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో ఇంకా పూర్తికాని వివిధ దశల్లో నిర్మాణ పనుల్లో కొనసాగుతున్న స్మశాన వాటిక లను
వారం లోగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ డీఈ దుర్గాప్రసాద్ ఏఈలు పాల్గొన్నారు.

Share This Post